ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపండి..కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపండి..కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
  •     కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అనుమతులు లేకుండా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే ఆపాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఎన్సీ (జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణా రివర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు (కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ) చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శుక్రవారం లెటర్ రాశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -2లో భాగమైన పుంగనూరు బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను.. అనుమతుల్లేకుండా 79.6 కి.మీ.ల నుంచి 220.35 కి.మీ.లకు విస్తరించేందుకు ఏపీ టెండర్లు పిలిచింని పేర్కొన్నారు.

తెలుగు గంగ ఐదో బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మినీ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం నిర్మించి నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలంలోని కోటంబేడు, మల్లెమాల చెరువులు నింపనున్నట్లు వెల్లడించారు. తెలుగు గంగ కాల్వపై మినీ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి కల్వోయ మండలం చింతలటమ్కూరు చెరువు నింపనున్నట్లు లేఖలో వివరించారు. ఈ పనులన్నీ ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘన కిందకే వస్తాయని వెల్లడించారు. కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ, అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమతి లేకుండా ఏపీ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటిని ఆపాలని లేఖలో ఆయన కోరారు.