
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9 న ప్రారంభమైన శాసన సభా సమావేశాలు మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఈ సభలో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. డిసెంబర్ 21 నాటికి సభలో కాంగ్రెస్ 64, బీఆర్ ఎస్ 39, బీజేపీ8, ఎంఐఎం 7, సీపీఐ ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి సమావేశం ఇది.
డిసెంబర్ 9 న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం పనితీరు, ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేసింది కొత్త గా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.గత ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ , ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేపడతామని చెప్పారు. ఇందుకు ప్రతిపక్ష పార్టీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా విచారణకు సిద్ధమే అని సవాల్ విసిరారు. డిసెంబర్ 21న సాయంత్రం 7.30 వరకు సాగిన సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.