అర్ధరాత్రి 12 గంటల వరకు..వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ

అర్ధరాత్రి 12 గంటల వరకు..వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. సోమవారం 19 పద్దులపై చర్చించారు. ఆయా పద్దులపై అర్ధరాత్రి వరకూ సభ్యులు తమ అభిప్రాయాలను సభలో వెల్లడించారు. దాదాపు సభ్యలు అడిగినంత సమయాన్ని స్పీకర్‌‌ కేటాయించారు. 

దీంతో అర్ధరాత్రి 12 గంటల వరకూ ఎమ్మెల్యేల ప్రసంగాలే కొనసాగాయి. మంగళవారం సభలో మిగిలిన పద్దులపై చర్చించనున్నారు. బుధవారం అప్రాప్రియేషన్ బిల్‌ పెట్టనున్నారు.