- ఛార్జీలు పెంచడంపై హర్షం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆటో ఛార్జీలను పెంచడంతో శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలోని ఆటో కార్మికులు గాంధీ భవన్‌లో సంబురాలు చేసుకున్నారు. 12 ఏళ్ల తర్వాత ఆటో ఛార్జీలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆటో కార్మికులు ర్యాలీగా ఆటోలతో గాంధీ భవన్‌కు వచ్చారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌ను సన్మానించిన కార్మికులు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆటో కార్మికులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తమ కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇండ్లలో తమకు అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
