గొప్ప దేశ భక్తుడిని కోల్పోయినం

గొప్ప దేశ భక్తుడిని కోల్పోయినం

హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ బిపిన్​ రావత్​కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్​ వెంకటస్వామి, సీనియర్​ నేత ఇంద్రసేనా రెడ్డి నివాళులర్పించారు. గురువారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. రావత్​ మరణం ప్రతి ఒక్కరినీ కలచివేసిందని డీకే అరుణ అన్నారు. దేశం ఒక గొప్ప దేశభక్తుడిని కోల్పోయిందని వివేక్​ వెంకటస్వామి అన్నారు. రావత్​ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.  టెర్రరిస్టుల దాడులను తిప్పికొట్టగలిగే వ్యూహకర్తగా పేరున్న రావత్​ మరణం.. దేశానికి  తీరని లోటు అన్నారు.