
ఢిల్లీ: 2019వ సంవత్సరానికి ఆగష్టు 5 విజయోత్సవ దినంగా అభివర్ణించారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఎన్నికల సందర్భంలో మ్యానిఫెస్టోలో చెప్పినట్టు బీజేపీ ఆర్టికల్ 370, 35a రద్దు చేసిందని ఆయన అన్నారు. ఈ ఆర్టికల్స్ ను రద్దు చేయాలని దేశ ప్రజలంతా కోరుకున్నారని, ప్రస్తుతం వారంతా సంబురాలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు.
రాజ్యసభలో హోమంత్రి అమిత్ షా ప్రతిపాదనతో ఈ బిల్లును రద్దు చేయడంపై… ఎన్నికల సమయంలో మోడీ,అమిత్ షా చెప్పిన వాగ్దానాన్ని నేడు నెరవేర్చారన్నారు సంజయ్. ఒకే దేశం ఒకే రాజ్యమనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలు నెరవేరుతున్నాయని అన్నారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పింది. అది ఎవరి జాగీరు కాదని సంజయ్ అన్నారు. తమ ప్రభుత్వంలో త్వరలో కాశ్మీర్ ని అభివృద్ధి చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టికల్ విషయంలో ద్వంద్వ వైఖరిని అవలభిస్తుందని సంజయ్ విమర్శించారు . భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగంమో కాదో కాంగ్రెస్,ఇతర పార్టీలు స్పష్టం చేయాలన్నారు. 370 ని వ్యతిరేకించిన పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలని ఆయన అన్నారు.
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి కలిగింది: అర్వింద్
కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు ఈ రోజుతో శాంతి కలిగిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ ఆర్టికల్ రద్దుతో వేల మంది కాశ్మీర్ పండితుల ఆత్మలు,సైనికుల ఆత్మలకు శాంతి కలుగుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం లేకుండె అన్న టి.ఆర్ ఎస్ నాయకురాలు,mim నేతలకు చెంప చెల్లుమందని అర్వింద్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ చేతకాని ప్రధానుల వల్ల గత 70 ఏళ్లుగా ఇబ్బందులు పడుతూన్నామని, ఈ రోజుతో వాటికి విముక్తి కలిగిందని ఆయన అన్నారు. శ్రావణమాసం సోమవారం రోజున జరిగిన మంచి పరిణామం ఇదని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగ వాతావరణం ఉందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు,యువత ఈ పండుగను సెలెబరేషన్ చేసుకోవాలని కోరుతున్నానని అర్వింద్ అన్నారు.