నేపాల్ పోరీతో..తెలంగాణ కుర్రాడి ప్రేమ పెళ్లి

నేపాల్ పోరీతో..తెలంగాణ కుర్రాడి ప్రేమ పెళ్లి

ఖతార్​లో ఇష్క్.. కాగజ్​నగర్​లో షాదీ
నేపాల్ ​అమ్మాయితో    సిర్పూర్(టి) అబ్బాయి ప్రేమ పెళ్లి

కాగజ్ నగర్, వెలుగు: ఎల్లలు దాటిన ప్రేమకు నిదర్శనం ఈ ఫొటోలో కనిపిస్తున్న జంట. దేశాలు వేరైనా.. భాష, సంస్కృతీ సంప్రదాయాలు వేరైనా ప్రేమ ఇద్దరినీ ఒక్కటి చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన అచ్యుత్​కుమార్ అరబ్​దేశమైన ఖతార్‌‌లో మెకానికల్ ఇంజనీర్‌‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఓ కంపెనీ మేనేజర్​గా పనిచేస్తున్న నేపాల్​కు చెందిన రమీలతో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు ఓకే చెప్పినా.. వివాహానికి కరోనా అడ్డుపడింది. అబ్బాయి ఇంటికాడ పెళ్లి చేయాలని అనుకునే టైంలో కరోనా సెకండ్​ వేవ్​స్టార్ట్​అయ్యింది. విమానాల రాకపోకలు ఆగిపోవడంతో పెళ్లి పోస్ట్​ పోన్ ​అయ్యింది. కరోనా ఎఫెక్ట్​తగ్గడంతో ఎట్టకేలకు అచ్యుత్ ​ఇటీవల ఇండియాకు వచ్చాడు. కానీ వధువు నేపాల్‌‌లోనే ఉండిపోయింది. వెడ్డింగ్​ కార్డుతో సహా భారత ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నా యువతి కుటుంబానికి పర్మిషన్​ ఇవ్వలేదు. వధువుతో పాటు ఆమె తమ్ముడిని మాత్రమే అనుమతించింది. దీంతో వరుడి మేనమామ, మేనత్తలే రమీలకు అమ్మానాన్నలుగా మారి కన్యాదానం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం కాగజ్​నగర్​లో మూడు ముళ్ల బంధంతో అచ్యుత్ కుమార్, రమీల ఒక్కటయ్యారు.