‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మకావు ఓపెన్‌‎లో సెమీస్‎కు చేరిన తెలంగాణ కుర్రాడు తరుణ్

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మకావు ఓపెన్‌‎లో సెమీస్‎కు చేరిన తెలంగాణ కుర్రాడు తరుణ్

మకావు: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలంగాణ కుర్రాడు మన్నెపల్లి తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మకావు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–300 టోర్నీలో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లో  23 ఏళ్ల తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21-–12, 13–-21, 21–-18తో హు జు (చైనా)ను చిత్తు చేశాడు. 75 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్ సెలెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నైపుణ్యం చూపెట్టాడు. 5–-0 ఆధిక్యంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టిన తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదే జోరును చివరి వరకు కొనసాగించాడు. క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు ర్యాలీలు, స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో క్రమంగా ఆధిక్యాన్ని 19-–15కు పెంచుకుని వెనుదిరిగి చూసుకోలేదు.

 బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–300 ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21–14, 18–21, 21–14తో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 77వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యువాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జు (చైనా)పై గెలిచాడు. గంటా మూడు నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడిన ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకపక్షంగా ఆడాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెట్టి 14–21, 21–13, 20–22తో చూంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–హైకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్ముద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మలేసియా) చేతిలో కంగుతిన్నారు.