బర్త్ డే పార్టీకి వెళ్లిన ముగ్గురు గోదావరిలో గల్లంతు

బర్త్ డే పార్టీకి వెళ్లిన ముగ్గురు గోదావరిలో గల్లంతు

ఏలూరు : గోదావరి తీరానా పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని వెళ్లిన తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోయారు. స్నానానికి దిగిన యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. వెస్ట్ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గోదావరిలో శనివారం ఈ సంఘటన జరిగింది. గోదావరిలో స్నానానికి దిగిన ఆరుగురిలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వ్యక్తులు శ్రీనివాస్‌రెడ్డి(20), శేషు(21), శివారెడ్డి(21)గా గుర్తించారు. గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది. బాధితులు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిరెడ్డిపాలెం వాసులుగా గుర్తించారు. బర్త్ డే వేడుకల కోసం ఏలూరు వచ్చిన వీరంతా ప్రమాదవశాత్తూ గోదావరిలో గల్లంతయ్యారని తెలిపారు స్నేహితులు. ముగ్గురూ ఐటీసీ కాగితం మిల్లులో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.