ఈ 11 జిల్లాలకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్.. హైదరాబాద్లో వర్షం ఉంటుందా..? లేదా..?

ఈ 11 జిల్లాలకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్.. హైదరాబాద్లో వర్షం ఉంటుందా..? లేదా..?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం మహబూబాబాద్, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

జనగాం, యాదాద్రి జిల్లాల్లో 11 సెంటీమీటర్లు, హైదరాబాద్లోని హయత్ నగర్లో 8.5 సెంటీమీటర్లు, కాప్రా, ఉప్పల్, నాగోల్, మల్కాజ్ గిరిలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎంగిల పూల బతుకమ్మ సందర్భంగా ఆదివారం వర్షాలతో పలు చోట్ల మహిళలు ఇబ్బందులు పడ్డారు. బతుకమ్మ వేడుకలకు అంతరాయం కలిగింది. రానున్న రోజుల్లో సైతం వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం చెప్పింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉదయం నుంచి ఎండ, ఉక్కపోత అధికంగా ఉంటుండగా సాయంత్రం నుంచి రాత్రంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి.