
రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఇందులో ఆరుగుగురికి స్థానం కల్పించగా.. తొలిసారి ఇద్దరు మహిళా నాయకులకు స్థానం కల్పించారు. వరుసగా హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతీ రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ లచే గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు.
హరీష్ రావు, కేటీఆర్ రెండో సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. గంగుల కమలాకర్, సత్యవతీ రాథోడ్ లు మొటిసారి మంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా పదవిని చేట్టారు. అయితే వారికి కెటాయించిన శాఖల వివరాలు తెలియాల్సి ఉంది.