
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదు గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది. కొత్త పురపాలక చట్టం బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత..ఆ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కొత్త పురపాలక చట్టం తీసుకొచ్చేందుకు గురు, శుక్రవారాల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు పురపాలకశాఖ సిద్ధంచేసిన ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం కూడా లభించింది. క్యాబినెట్ లో ఆమోదించిన బిల్లును ఈ నెల 18న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 19న ఆమోదం పొందనున్నారు. అదేరోజు కౌన్సిల్‌లోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.