- కొల్లాపూర్ కాలువలకు గ్రీన్ సిగ్నల్
- ‘నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల’ సామర్థ్యం 3 టీఎంసీలకు పెంపు
- ప్రాజెక్టులపై కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, అసంపూర్తి పనుల ప్రక్షాళన దిశగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సె క్రటేరియెట్ లో కేబినెట్ సమావేశం జరిగింది. మంథని నియోజకవర్గంలో ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం మిగిలిన పనుల కోసం 2026-27 ఎస్ఎస్ఆర్ ప్రకారం సవ. రించిన అంచనాల మేరకు రూ.1,017 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కన్నెపల్లి వద్ద గోదావరి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ స్కీమ్ పాత ఈపీసీ ప్యాకేజీని 'యాస్ ఈజ్ వేర్ ఈజ్' ప్రాతిపదికన ముగించి, కొత్తగా ఎనిమిది చెరుపుల అనుసంధానం, 238.67 కి.మీ మేర కెనాల్ నెట్ వర్క్, లైనింగ్ పనులు, జీఆర్పీ పైపుల స్థానంలో 19.10 కి.మీ. ఎంఎస్ ప్రెజర్ మెయిన్స్ నిర్మాణం చేపట్టను. న్నారు. ఈ స్కీమ్ ద్వారా స్టేజ్ 1 కింద 10,089 ఎకరాలు, స్టేజ్ 2 కింద 34,911 ఎకరాలు మొత్తం 45 వేల ఎకరాలకు నీరందుతుంది. మిగిలిన 1,456 ఎకరాల భూసేకరణకు ఇప్పు టికే జీవో 248 ద్వారా రూ.166.67 కోట్లు కేటా యించింది
గట్టు' అంచనా వ్యయం 1,781 కోట్లకు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్లసోమనాద్రి (గట్టు) రి జర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 1.32 టీఎంసీల నుంచి 3.00 టీఎంసీలకు పెంచే పనులను పాత కాంట్రాక్ట్ ఏజెన్సీ (జీవీఆరఐపీఎల్-ఎం ఎస్సార్-ఎన్ సీఎల్ జేవీ) కే అప్పగించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.1,781.90 కోట్లు, సాంకేతికంగా పాత, కొత్త పనులు కలిసి పోయి ఉన్నందున వేరే ఏజెన్సీకి ఇస్తే వివాదాలు, జాప్యం జరుగుతాయన్న ఈఎన్సీ నివేదికతో ప్ర భుత్వం ఏకీభవించింది. టీజీ పీడబ్ల్యూడీ కోడ్ ప్రకారం అదనపు పనులను 2021-22 ఎస్ఎ స్ఆర్ రేట్లతో, ఎలాంటి టెండర్ లేకుండా ప్రస్తుత ఏజెన్సీకే అప్పగించాలని, ఏజెన్సీ సాంకేతిక, ఆర్థిక అర్హతలను పరిశీలించిన తర్వాతే ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేసింది.
బచారం హైలెవెల్, ముక్కిడిగుండం కాలువకు..
కొల్లాపూర్ నియోజకవర్గంలో 7,590 ఎక రాలకు సాగునీరు, 8 గ్రామాలకు తాగునీరు అందించే ఎంజీకేఎల్ఐఎస్ బచారం హైలెవెల్ కెనాల్, ముక్కిడిగుండం కాలువ పనులకు కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది జొన్నలబొగుడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆధారంగా బచారం కెనాల్ ద్వారా పెద్దకొత్త పల్లి మండలంలో 5,990 ఎకరాలు, ముక్కి డిగుండం ద్వారా కొల్లాపూర్ మండలంలో 1,600 ఎకరాలకు సాగునీరందుతుంది. మొత్తం రూ.164.60కోట్ల అంచనా వ్యయంలో భూసేకరణ కోసం అవసరమైన 444 ఎకరాల కుగాను రూ.31.080కోట్లకు ప్రభుత్వం తక్షణ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ముందుగా 70 శాతం భూసేకరణ పూర్తి చేసిన తర్వాతే ప్రధాన పనుల ఎస్టిమేట్లను కేబినెట్ ఆమోదా నికి తేవాలని ఆదేశించింది. ఎంజీకేఎల్ఎఎస్ 40 టీఎంసీల కేటాయింపుల పరిధిలోనే ఈ పనులుంటాయని స్పష్టం చేసింది.
రద్దయిన10 సాగునీటి ప్యాకేజిలివే
ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న 10 ఈపీసీ సాగునీటి ప్యాకేజీలను ఇరుపక్షాల అంగీకారంతో, ఎలాంటి వివాదాలు లేకుండా రద్దు (ప్రీక్లోజర్) చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీ 1. 2, 15, సమ్మక్క సాగర్, ఎస్సార్ఎస్పీ స్టేజ్ కోనిమాకుల ఎత్తిపోతల, కొమ రంభీమ్ సీ 118, జగన్నాథపూర్ సీ119, ఎస్సార్ఎస్పీ స్టేజ్ 2 సీ255, వరంగల్ 71, ఖమ్మం 72 ఫ్లడ్ బ్యాంక్ పనులు ఉన్నాయి. భూసేకరణ సమస్యలు, క్లియరె స్సుల ఆలస్యంతో నిలిచిపోయిన ఈ ప్యా కేజీల కాంట్రాక్టర్ల తాత్కాలిక బకాయిలు రూ.153.98 కోట్లుగా తేల్చారు. నిబంధనల ప్రకారం లయబిలిటీలను పరిష్కరించిన తర్వాతే బ్యాంక్ గ్యారెంటీ లను విడుదల చేయాలని, మిగిలిపోయిన 1,16,504 ఎకరాల ఆయకట్టు పనులకు రూ.671.14 కోట్లతో విడివిడిగా సరికొత్త అంచనాలు రూపొందించి తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
