- 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ
- పీఎం కుసుం, పీఎం సూర్య ఘర్ వంటి పథకాలు స్పీడప్
- పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంపై ఫోకస్
- సోలార్ ప్లాంట్లు పెట్టే ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహకాలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. డిమాండ్ కు తగ్గట్లుగా థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. దీంతో సోలార్పవర్జనరేషన్ పై సర్కార్ ఫోకస్ చేసింది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల రెన్యూవబుల్ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం స్వయంగా పలు పథకాలను ప్రకటించడంతో పాటు కేంద్రం అమలుచేస్తున్న పీఎం కుసుమ్, పీఎం సూర్య ఘర్ వంటి పథకాలను సైతం ప్రోత్సహిస్తోంది.
రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మళ్లేలా...
నాణ్యమైన బొగ్గు లభించకపోవడం వల్ల థర్మల్, వర్షాభావ పరిస్థితుల కారణంగా హైడల్పవర్జనరేషన్తగ్గిపోతోంది. పైగా థర్మల్‌విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువ కావడంతోయూనిట్ కు రూ.6- నుంచి రూ.8 దాకా ఖర్చు అవుతోంది. అదే సోలార్ పవర్ కు అయితే రూ. 4కు మించి ఖర్చు కావడం లేదు. పైగా జీరో పొల్యూషన్కావడంతో రాబోయే రోజుల్లో పూర్తిగా రెన్యూవబుల్ఎనర్జీ వైపు మళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే ఐదేండ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో గ్రీన్ఎనర్జీ పాలసీని తెచ్చింది.
స్పీడ్ గా పీఎం కుసుమ్, సూర్యఘర్
రాష్ట్రాన్ని సౌరవిద్యుత్కేంద్రంగా మార్చే క్రమంలో కేంద్రం అమలు చేసే పీఎం కుసుమ్, సూర్యఘర్ వంటి పథకాలను రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తోంది. పీఎం సూర్యఘర్స్కీంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 207.94 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రజలు తమ ఇండ్ల పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ఈ స్కీమ్ కింద ఆగస్టు 5 నాటికి 87,832 అప్లికేషన్లు రాగా 56,462 ఇండ్లపై సోలార్జనరేషన్ప్రారంభించింది. కేంద్రం మంజూరు చేసిన రూ.331.81 కోట్ల సబ్సిడీని ఇప్పటికే లబ్ధిదారులకు అందజేశారు.
పీఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా రైతులు బ్యాంకులోన్లు తీసుకుని 0.5 నుంచి 2 మెగావాట్ల విద్యుత్యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. రైతుల నుంచి రూ.3.13లకు ఒక యూనిట్ చొప్పున కరెంట్కొనేలా డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,156 మంది రైతులు 1,796.3 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి చేయడానికి డిస్కమ్‌లతో పవర్పర్చేస్అగ్రిమెంట్లు (పీపీఏ)లు చేసుకున్నారు. ఇప్పటివరకు 100 మెగావాట్లకు పైగా ప్లాంట్లు గ్రిడ్‌కు అనుసంధానం చేసి దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.
స్కూళ్లు, ఆఫీసులపై సోలార్ ప్యానెల్స్
రెడ్కో ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆఫీసుల్లో సోలార్విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 9,937 స్కూళ్లపై రూ.273.19 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. 2,025 స్కూళ్లలో రెండు కిలోవాట్స్, 7,293 స్కూళ్లలో ఐదు కిలోవాట్స్, 619 స్కూళ్లలో పది కిలోవాట్స్సామర్ధ్యం గల ప్లాంట్లు ఏర్పాటు చేసి మొత్తం 46.7 మెగావాట్ల విద్యుత్ఉత్పత్తికి ప్లాన్ చేశారు. మరో వైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై కూడా రూఫ్ టాప్సోలార్పానెల్స్ఏర్పాటు చేయనున్నారు. ఎన్ని ఆఫీసులకు ఎంత విద్యుత్అవసరమో లెక్క తీసి రెడ్కో కు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ రిపోర్ట్స్ అందగానే టెండర్లు పిలవనున్నారు.
మహిళా సంఘాలకు ప్రోత్సాహం
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ జాగాల్లో వెయ్యి మెగావాట్ల సోలార్పవర్ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల సమాఖ్యల నుంచి లేదా స్త్రీనిధి నుంచి 10 శాతం నిధులు సమకూరిస్తే 90 శాతం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకునే అవకాశం ఉంది. రూ.4 వేల కోట్లతో అన్ని జిల్లాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే 31 జిల్లాల్లో భూములను గుర్తించారు. ఖమ్మం, అసిఫాబాద్, వికారాబాద్, పెద్దపల్లి, వనపర్తి, జనగామ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పనులు కంప్లీట్కాగా 9 మెగావాట్ల సోలార్పవర్జనరేషన్స్టార్ట్అయింది.
రాష్ట్రంలో 80 గ్రామాలను మోడల్ సోలార్ విలేజ్ లుగా గుర్తించారు. మొత్తం 40,349 ఇండ్లలో ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ వ్యవసాయ పంప్సెట్ల వద్ద కూడా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల సొంత మండలాలైన కొడంగల్, బోనకల్‌లోని ఆరు గ్రామాలను ఈ స్కీమ్‌లో చేర్చారు. ఈ గ్రామాల్లో ఇప్పటివరకు 50 శాతం పనులు కంప్లీట్ అయ్యాయి.
సబ్స్టేషన్ల దగ్గర సోలార్ ప్లాంట్లు
రాష్ట్రంలో 18 విద్యుత్‌సబ్‌స్టేషన్ల దగ్గర 19 మెగావాట్ల సోలార్పవర్ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.66.50 కోట్లు కేటాయించింది. ఇందుకోసం 73.25 ఎకరాల సర్కారు భూమిని గుర్తించారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టనుంది. 2032 నాటికి 7,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల(పీఎస్పీ)ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రూ. 95 వేల కోట్ల వ్యయంతో 11,210 మెగావాట్ల పీఎస్పీ ప్లాంట్ల ఏర్పాటుకు తొమ్మిది ప్రైవేట్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన టాటా కన్సల్టెన్సీ, హైబ్రిడ్ అర్బనిస్ట్స్ కంపెనీలు 29 స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి టెక్నో -కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చాయి. జెన్‌కో ఇంజినీర్లు మళ్లీ సర్వే చేసి 13 సైట్లలో పనులు చేపట్టడానికి ఆమోదం తెలిపారు. తొలిదశలో ఖమ్మం జిల్లాలోని కల్లూరులో రూ.8,888 కోట్లతో 1,500 మెగావాట్ల పీఎస్పీ ప్లాంట్‌ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇచ్చింది. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. దీంతో పాటు జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, బీఈఎస్ఎస్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌పై కూడా సర్కారు ఫోకస్ చేసింది.
చదువుకోని వారికి తిప్పలు
ప్రభుత్వం ఓటరు నమోదు ప్రక్రియను డిజిటలైజ్ చేస్తూ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌తో పాటు ఎన్వీఎస్పీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే, చదువుకోని వారికి స్మార్ట్‌ఫోన్లు వాడడం, యాప్‌లలో వివరాలు నమోదు చేయడం, ఫొటోలు, ఇతర పేపర్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడం రాదు. దీంతో వారు మాన్యువల్ లో ఫారం–-6ను పూర్తి చేసి ఇవ్వడానికి బీఎల్వోలను సంప్రదిస్తే తీసుకోవడం లేదు. దీంతో ఉచితంగా కావాల్సిన ఓటరు నమోదు కోసం వీరు రూ.100 నుంచి రూ.200 వరకు నెట్ సెంటర్లకు పెట్టాల్సి వస్తోంది.
