
ఈ నెల 5 న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పై కేబినెట్ చర్చించి ఆమోదం తెలుపనుంది.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై ప్రసంగించనున్నారు. రెండేళ్ల అనంతరం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించనున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ప్రసంగించలేదు. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం వద్దని ప్రభుత్వం భావించింది. కానీ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మళ్లీ గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రకటించింది.