రేపు(జనవరి 8).. తెలంగాణ కేబినెట్ భేటీ

 రేపు(జనవరి 8).. తెలంగాణ కేబినెట్ భేటీ

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది.  నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ భేటీలో ప్రముఖంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజాపాలనలో అందిన ధరఖాస్తులు, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై చర్చించనున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు2023 డిసెంబర్ 9న  కేబినెట్ భేటీ జరిగింది.  ఇది రెండో కేబినెట్ భేటీ కావడం  కావడం విశేషం.  

నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది : రేవంత్ రెడ్డి 

రాష్ట్రంలో  నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.  సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్నారు.రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా తన  బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పారు.