ఈ నెల15న టీసీఈఐ అవార్డ్స్

ఈ నెల15న టీసీఈఐ అవార్డ్స్

హైదరాబాద్: తెలంగాణా చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఎనిమిదో సారి నిర్వహిస్తున్న ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 గ్రాండ్ ఫినాలేను ఈ నెల15న నిర్వహిస్తారు.  ఈవెంట్స్ పరిశ్రమలో ఉన్న అసాధారణ ప్రతిభ, కొత్తదనం, అంకితభావాన్ని గుర్తించడానికి  అవార్డులను ఇస్తున్నామని టీసీఈఐ తెలిపింది. 

టీసీఈఐ  ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అధికారిక పోస్టర్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్​లో శుక్రవారం హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు బాలరాం బాబు, జనరల్ సెక్రటరీ రవి బూరా,  ట్రెజరర్ తౌఫిక్ ముహమ్మద్ ఖాన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలరాం బాబు మాట్లాడుతూ ఈ ఏడాది అవార్డ్స్‌‌‌‌‌‌‌‌కు 400కిపైగా నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.  'పెర్ల్ ఆఫ్ హైదరాబాద్' కేటగిరీలో 80కు పైగా విభాగాలు, 'జెమ్ ఆఫ్ ఇండియా' కేటగిరీలో 15 విభాగాలు ఉన్నాయని తెలిపారు.