
అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకి అద్దం పట్టేది రాఖీ పండుగ. ఈ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, పలువురు ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అందులో భాగంగా... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతం చేసేది రక్షా బంధన్ అన్నారు. అన్నా, తమ్ముళ్లు.. తమ అక్కా చెల్లెళ్లకు ఎల్లవేళలా అండగా నిలబడుతారనే భరోసాతో పాటు భావన ఈ పండుగలో ఇమిడి ఉందన్నారు. సోదర భావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకొంటారన్నారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో ఆనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని తెలిపారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు... కరోనా కారణంగా రెండేండ్లుగా రాఖీ పండుగరకు బ్రేక్ పడింది. ఈసారి కరోనా తీవ్రత లేకపోవడంతో పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రాఖీలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్లకు వెళుతున్నారు. దీంతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. సాదాసీదా రాఖీలతో పాటు క్రియేటివ్‌గా, కస్టమైజ్డ్గా ఉన్న రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. ఆఫ్‌లైన్ మార్కెట్లు, ఆన్ లైన్ లో డిఫరెంట్ వెరైటీల్లో రాఖీలు, రిటర్న్‌గిఫ్ట్‌లు లభిస్తున్నాయి. లాకెట్లపై బ్రదర్, భాయ్ వంటి అక్షరాలను రాసి తయారుచేస్తున్నారు. హ్యాండ్ మేడ్ ఫొటో ప్రింటెడ్ రాఖీలు, సీడ్ రాఖీలు ట్రెండీగా వస్తున్నాయి.