
అంబర్పేట్, వెలుగు : హైకోర్టు స్పష్టత ఇచ్చేవరకు గద్దర్ అవార్డులను ఆపాలని తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో వేదిక రాష్ట్ర ఆఫీసులో గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, కన్వీనర్ లారా, కో కన్వీనర్ మోహన్ బైరాగి మాట్లాడారు.
గద్దర్ అవార్డులను ఆంధ్ర సినిమాలకే ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని ఆరోపించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని చెప్పారు. కోర్టులో తేలే దాకా అవార్డులను ఆపాలని వేదిక డిమాండ్ చేసింది.