
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్జనరల్గా డా. పీవీఎస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్జనరల్గా పనిచేశారు. ఇండియన్ పోస్టల్సర్వీస్ 1993వ బ్యాచ్‌కు చెందిన పీవీఎస్..సెంట్రల్ సివిల్‌సర్వీసెస్ గ్రూప్–ఎ లో జాయిన్ అయ్యారు.
ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. గతంలో ఆయన ఉమ్మడి ఏపీ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు పోస్టల్సర్కిళ్లలో పనిచేశారు. పోస్టల్‌శాఖ ఉన్నతికి సంస్కరణలు అమలు చేశారు.