ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం

ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం

అసోం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని  ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ డిమాండ్ చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌ కు వచ్చిన సీఎం హిమంత్ బిశ్వ శర్మపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమని నుమాల్ అభిప్రాయపడ్డారు. దీనిపై న్యాయమైన విచారణను కోరుతామని తెలిపారు.

 

అసోం సీఎం మాట్లాడుతుండగా టీఆర్ఎస్ ​కార్యకర్త నందకిషోర్ స్టేజీ పైకి వచ్చి మైకును లాక్కోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్  గా మారింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని నందకిషోర్ ను అరెస్ట్​ చేసి అబిడ్స్​ పీఎస్​కు తరలించారు.  ఈ ఘటన పై తెలంగాణ బీజేపీ లీడర్లు కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు. గణేశ్ ​ఉత్సవాలకు వచ్చిన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పై టీఆర్ఎస్​ నాయకులు ప్లాన్ ప్రకారమే దాడి చేశారంటూ ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు మాత్రమే ఇలాంటి దాడులకు పాల్పడతారంటూ ఫైర్ అయ్యారు.