ఆరు నెలల్లో ఎన్నికలు...  చేసింది చెప్పుకుంటే గెలుపు మనదే : ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్

ఆరు నెలల్లో ఎన్నికలు...  చేసింది చెప్పుకుంటే గెలుపు మనదే : ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్  కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ కు 105 సీట్లు ఖాయమని స్పష్టం చేశారు.  ప్రజలకు ఏం చేశామో చెప్పుకుంటే చాలని పార్టీ నేతలతో సీఎం అన్నారు. అదే మనల్ని గెలిపిస్తుందంటూ చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్.

గడిచిన పదేళ్లలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పాలని నేతలకు సీఎం సూచించారు.  తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటాయని,  లీడర్లు పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు పరిమితం కావాలని అన్నారు.

 గడిచిన 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు  చేసిందేమీ లేదని కేసీఆర్  విమర్శించారు. ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరన్నారు.  మంత్రులు ఆయా జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలోపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో పర్యటనలో ఉండటంలో మంత్రి కేటీఆర్ హాజరుకాలేదు.