చిరంజీవికి పద్మవిభూషణ్‌ రావడం మనందరికీ గర్వకారణం : సీఎం రేవంత్ రెడ్డి

 చిరంజీవికి పద్మవిభూషణ్‌ రావడం మనందరికీ గర్వకారణం :  సీఎం రేవంత్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్‌ పురస్కారం వరించడంతో  ఆయన కోడలు ఉపాసన సీనీ రాజకీయ ప్రముఖులకు 2024 ఫిబ్రవరి 03వ తేదీ శనివారం రాత్రి హైదరాబాద్‌లో విందు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.  ఈ సందర్భంగా చిరంజీవికి పుష్పగుచ్ఛం అందజేసి సీఎం అభినందనలు తెలిపారు. చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.  తనను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటుగా  మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు.. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌,  మాజీ మంత్రి డీకే అరుణ, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పలువురు సీనీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.  

మరోవైపు పద్మ అవార్డులు పొందిన తెలుగు వారిని ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది.   హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో  సీఎం రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలను సత్కరించనున్నారు.  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  నటుడు చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్‌  ప్రకటించింది.  చిందు యక్షగాన కళాకారుడు సమ్మయ్య, ఆనందాచారి, బుర్రవీణ కథకుడు కొండప్ప కవి కూరెళ్ల విఠలాచార్య,  సంగీత కళాకారుడు సోమాలాల్, నాటక కళాకారిణి ఉమామహేశ్వరిని పద్మశ్రీ పురస్కరాలు లభించాయి.