రాహుల్ గాంధీ బర్త్ డే .. సీఎం రేవంత్ విషెస్

రాహుల్ గాంధీ బర్త్ డే .. సీఎం రేవంత్ విషెస్

రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు  సీఎం రేవంత్ రెడ్డి. సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండే గొప్ప నేత అన్నారు. త్యాగం, వారసత్వం, పోరాటమే ఆయన ధ్యేయమన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు రేవంత్ రెడ్డి.  సీఎంతో పాటుగా పలువురు రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆయనకు సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  రాహుల్ గాంధీ  2024 జూన్ 19 బుధవారం రోజున  54వ ఏట అడుగుపెట్టారు.