ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్.. కేసీఆర్పై సీఎం విమర్శలు

ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్.. కేసీఆర్పై సీఎం విమర్శలు
  • రబ్బర్ చెప్పులు లేనోళ్లకు పేపర్లు, టీవీలు వచ్చినై
  • త్యాగం మీకు సూట్ కాదు
  • కేసీఆర్ పై సీఎం విమర్శలు


హైదరాబాద్: కేసీఆర్, ఆయన ఫ్యామిలీ తెలంగాణ కోసం త్యాగాలు చేసినట్టు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని, వాళ్ల పనంతా.. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజీనామాలు చేసి ఎలక్షన్లు తేవడం.. సెలెక్ట్ చేసుకున్నోళ్ల దగ్గరికి వెళ్లి కలెక్షన్లు చేసుకోవడం వాళ్ల పని అని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో వాళ్లు చేసిందే ఇదేనని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన నిఖార్సయిన వ్యక్తి కొండా లక్ష్మణ్​ బాపూజీ అని కొనియాడారు.

కేసీఆర్ కు నిలువ నీడనిచ్చి ఆఫీసు పెట్టుకునేందుకు జాగా ఇచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. కొండా లక్ష్మణ్​ బాపూజీని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అప్పుడు రబ్బర్ చెప్పులు లేనోళ్లకు పేపర్లు, టీవీ చానళ్లు వచ్చాయని, జూబ్లీ హిల్స్ లో బంగళాలు, ఎర్రవల్లిలో ఫాంహౌస్ వచ్చాయని ఎద్దేవా చేశారు. అసలు త్యాగం అనే పదం కేసీఆర్ ఫ్యామిలీకి సూట్ కాదని చెప్పారు.