కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం

కలెక్టర్లు, ఎస్పీలతో  ఇవాళ  సీఎం రేవంత్  సమావేశం
  •     సెక్రటేరియెట్​లోని ఏడో ఫ్లోర్​లో 
  •     9 అంశాలపై దిశానిర్దేశం

కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం  సమావేశం కానున్నారు. మొదటిసారి సెక్రటేరియెట్​లోని ఏడో అంతస్తులో గల కాన్ఫరెన్స్​ హాల్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. తొమ్మిది అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు.  ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, విద్య, వైద్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన తదితర కీలక అంశాలపై రేవంత్‌‌ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. 

సమావేశంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ సమావేశం జరగనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల ముఖ్యకార్యదర్శుల సమావేశంలో కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం లేదని.. గ్రౌండ్​ లెవల్​కు కలెక్టర్లు వెళ్లాలని స్పష్టం చేశారు. ఇప్పుడు వీటిని మళ్లీ కలెక్టర్లకు చెప్పడంతో పాటు జిల్లా స్థాయిలో ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్, మండల రెవెన్యూ ఆఫీసులు, ప్రభుత్వ పాఠశాలల విజిటింగ్, మానిటరింగ్​ వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలిసింది.