ప్రజాస్వామ్యానికి నకిలీ రంగు

ప్రజాస్వామ్యానికి నకిలీ రంగు

హైదరాబాద్, వెలుగు : హోలీ సంద ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ కాంగ్రెస్ సెటైరికల్ గా ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ ఫొటోను ‘ఎక్స్’లో ​పోస్ట్ చేసి ఫొటో మీద రంగు గుప్పినట్టు ఉంది.. కింద నకిలీ రంగులతో జాగ్రత్త అని సోమవారం ట్వీట్ లో హెచ్చరిం చింది.

“మన ప్రజాస్వామ్యానికి ఒక ‘నకిలీ రంగు’ అంటుకుంది. ఆ ‘రంగు‘ ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేసి, దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించే దిశగా సాగుతున్నది. ఇకనైనా మేల్కొండి.. ఈ నకిలీ రంగు ప్రజాస్వా మ్యానికి ప్రమాదకరం. మీ ఓటు అనే ఆయుధంతో ఈ నకిలీ రంగు భారీ నుంచి దేశాన్ని కాపాడండి... ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించండి” అని పేర్కొంది.