జాడలేని వర్కింగ్ ప్రెసిడెంట్లు.. సైలెన్స్ వెనుక కారణమేంటి.?

జాడలేని వర్కింగ్ ప్రెసిడెంట్లు.. సైలెన్స్ వెనుక  కారణమేంటి.?

కాంగ్రెస్ లో పదవులు ఇయ్యకుంటే రోడ్డెక్కుతారు. పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగానే ఉంటారు. ఇక కొందరిని కీలక పదవుల్లో కూర్చోబెడితే..ఆఫీసులకే వస్తలేరని క్యాడర్ లో చర్చ నడుస్తోంది. రెండేళ్ల కిందట PCC చీఫ్  గా రేవంత్ ను నియమించిన టైమ్ లోనే...పార్టీకి ఐదుగురిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పెట్టింది ఏఐసీసీ. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీలు అజారుద్దిన్, అంజన్ కుమార్ యాదవ్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మహేష్ కుమార్ గౌడ్ కు అదనంగా పార్టీ ఆర్గనైజషన్ బాధ్యతల్ని అప్పజెప్పింది హైకమాండ్. ప్రతి వర్కింగ్ ప్రెసిడెంట్ కు మూడు లేదా నాలుగు పార్లమెంట్లకు ఇంచార్జిలుగా వేశారు. అలాగే అనుబంధ సంఘాలను ఇంఛార్జిలుగా పెట్టారు ఢిల్లీ పెద్దలు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలోపేతం, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో నేతల్ని కో ఆర్డినేషన్ చెయాల్సిన పని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లదే.

చెప్పుకోవడానికి బాగానే ఉన్నా..రెండేళ్లుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎక్కడ కనిపించడం లేదని పార్టీ క్యాడర్ మొత్తుకుంటోంది. పదవులొచ్చాక పనిచేయడమే మానేశారనే చర్చ పార్టీలో నడుస్తోంది. వాళ్ల కోసం ఏర్పాటు చేసిన చాంబర్లు రెండేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన చాంబర్లు..ఇప్పుడు గాంధీ భవన్ అటెండర్లకు లంచ్ టైం లో ఉపయోగపడుతున్నాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. 

జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దిన్ లు కనీసం ఒక్కసారైన వాళ్ల చాంబర్లకు రాలేదట. రేవంత్ తో విభేదాల కారణంగా గాంధీ భవన్ వైపు కన్నెత్తి చూడటం లేదట జగ్గారెడ్డి. ఇక హెల్త్ ఇష్యూస్ పేరుతో గీతారెడ్డి కూడా ఇంటికే పరిమితం అయ్యారట. అజారుద్దిన్ అందుబాటులో వున్నా కనిపించరని, పార్టీ కార్యక్రమాలకే రారని పార్టీ లీడర్లే మాట్లాడుకుంటున్నారు. మరో వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.. వారానికో పదిరోజులకోసారి  ఇలా వచ్చి అలా వెళ్తారట. వీళ్లు పేరుకే పార్లమెంట్ ఇంచార్జిలట..ఏ రోజు వాళ్లు అక్కడికి వెళ్లిన సందర్భాలు లేవట. 

నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల పరిస్థితి ఇట్ల ఉంటే ..ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి మరోలా ఉంది. గాంధీ భవన్ కు రెగ్యూలర్ గా వచ్చినా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూడడమే సరిపోతోందట. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల కమిటీలు వేయడం, నేతలకు వివిధ రకాల బాధ్యతల్ని అప్పగించడం పనుల్లో బిజీగా ఉంటున్నారట. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట మహేష్ కుమార్ గౌడ్.