ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌–19 జట్టులో యశ్వీర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌

ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌–19 జట్టులో యశ్వీర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: శ్రీలంకలో పర్యటించనున్న ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌–19 జట్టులో తెలంగాణ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఉట్కూర్‌‌‌‌‌‌‌‌ యశ్వీర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌కు చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ జూనియర్‌‌‌‌‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ కమిటీ గురువారం వన్డే, మల్టీ డే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల కోసం రెండు జట్లను ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా యశ్‌‌‌‌‌‌‌‌వర్ధన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌కు, వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా లక్ష్య రాయ్‌‌‌‌‌‌‌‌ చందానికి బాధ్యతలు అప్పగించారు. లెజెండరీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ చిన్న కుమారుడు అన్వయ్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌కు తొలిసారి చాన్స్‌‌‌‌‌‌‌‌ దక్కింది. 17 ఏళ్ల అన్వయ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యాడు.  

ఇండియా అండర్-–19 వన్డే జట్టు: యశ్‌‌‌‌‌‌‌‌వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్‌‌‌‌‌‌‌‌చందాని (వైస్ కెప్టెన్), సాగర్ వీర్క్, వినీత్ వి.కె, అర్జున్ రాజ్‌‌‌‌‌‌‌‌పుత్, కుశాగ్ర ఓజా, రజత్ బాఘేల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), అన్మోల్‌‌‌‌‌‌‌‌జీత్ సింగ్, వుట్కూరి యశ్‌‌‌‌‌‌‌‌వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, షావిన్ వి, కావ్య పరేష్ పటేల్, మోహిత్ ఉల్వా, ఇషాన్ సూద్.


మల్టీ-డే జట్టు: యశ్‌‌‌‌‌‌‌‌వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్‌‌‌‌‌‌‌‌చందాని (వైస్ కెప్టెన్), సాగర్ వీర్క్, పటేల్ కుష్, మనాల్ చౌహాన్, కుశాగ్ర ఓజా, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్ కీపర్), హేమచూడేశన్ జె, బి.కె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ పటేల్, ప్రియాంషు సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.