హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 1వ తేదీలోగా రాష్ట్రంలో అకాల వర్షంతో జరిగిన పంటనష్టం వివరాలను సమర్పించాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సోమవారం అధికారులతో సీఎస్వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించి పంట నష్టం వివరాలను సేకరించి, సమర్పించాలని సీఎస్ స్పష్టం చేశారు.
గత పంట నష్టానికి సంబంధించిన పరిహారం పంపిణీ మొదలుపెట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉన్నందునా ధాన్యం సేకరణ కేంద్రాల్లో తగు చర్యలు చేపట్టాలని శాంతికుమారి ఆదేశించారు.
