క్రిస్మస్​ వేడుకలు ఘనంగా నిర్వహించాలి : డిప్యూటీ సీఎం భట్టి

క్రిస్మస్​ వేడుకలు ఘనంగా నిర్వహించాలి : డిప్యూటీ సీఎం భట్టి
  • క్రిస్మస్​ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్​వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం రాత్రి ఆయన ప్రజా భవన్​లో క్రిస్మస్ ​వేడుకలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్రిస్మస్ ​పండుగ కావడంతో ఘనంగా జరుపాలని సూచించారు. పేద క్రిస్టియన్లకు గిఫ్ట్​ ప్యాక్​ల పంపిణీ, క్రిస్మస్ ​విందులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ఇచ్చే విందుకు సీఎం రేవంత్ ​రెడ్డి హాజరవుతారని చెప్పారు.

గ్రేటర్​ హైదరాబాద్​లోని 200 ఏరియాల్లో 500 మందికి చొప్పున రాష్ట్రంలోని మిగతా 95 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వెయ్యి మందికి చొప్పున క్రిస్మస్​ గిఫ్ట్ ​ప్యాక్​లు ఇవ్వడంతో పాటు విందులు ఏర్పాటు చేయాలని వివరించారు. గిఫ్ట్​ప్యాక్​లో అందజేసే దుస్తుల నాణ్యతను డిప్యూటీ సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్​జలీల్, ఎంసీఆర్​హెచ్ఆర్డీ అడిషనల్​ డైరెక్టర్​  మహేశ్​దత్​ఎక్కా తదితరులు పాల్గొన్నారు.