హ్యాబిట్ ఫార్మింగ్ మందులు అంటే..? డాక్టర్ చీటీ లేకుండా అమ్మకూడదా?

హ్యాబిట్ ఫార్మింగ్ మందులు అంటే..?  డాక్టర్ చీటీ లేకుండా అమ్మకూడదా?
  • రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులలో టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ తనిఖీలు 
  • 125 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు: అక్రమంగా హ్యాబిట్ ఫార్మింగ్ మందుల అమ్మకాలపై టీజీ సేఫ్ – డ్రగ్స్ వింగ్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ పోలీసులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. క్యూర్ రీజియన్​లోని మేడ్చల్, శేరిలింగంపల్లి జోన్లతో పాటు పలు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో డెకాయ్ ఆపరేషన్లు, టెస్ట్ పర్చేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా మెడికల్ షాపులను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన 125 మెడికల్ షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులిచ్చారు. షెడ్యూల్ హెచ్1 పరిధిలోని ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజోలం, బ్యుప్రెనార్ఫిన్, క్లోర్డియాజిపాక్సైడ్, కొడీన్ సిరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డయాజిపామ్, నైట్రాజిపామ్, పెంటాజోసిన్ తదితర మందులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

హ్యాబిట్ ఫార్మింగ్ మందులు అంటే:

హ్యాబిట్ ఫార్మింగ్ మందులు అంటే వాటిని తరచుగా వాడటం వల్ల శారీరక లేదా మానసికంగా వాటిపైనే ఆధారపడటానికి దారితీసేవి. అంటే వాటిని రెగ్యులర్ గా వాడటం వలన వాటి వ్యసనానికి (Addiction) దారితీసే మందులు. వీటిని ఒకసారి అలవాటు పడితే, వైద్య అవసరం లేకపోయినా పదేపదే వేసుకోవాలనే బలమైన కోరిక కలుగుతుంది. అంటే ఈ మందులు అడిక్షన్ వైపు దారితీస్తాయి. 

రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే

రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ రాసిన ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ మందులను అమ్మడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లు, షెడ్యూల్ హెచ్1 రిజిస్టర్లను నిర్వహించకపోవడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకపోవడం, బిల్లులు ఇవ్వకపోవడం, అమ్మకాలు, -కొనుగోళ్ల రికార్డులను చూపించడంలో విఫలమవడం వంటి లోపాలు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. హ్యాబిట్ ఫార్మింగ్ మందుల అక్రమ విక్రయాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్-ఫ్రీ నంబర్ 1800–-599–-6969కి కాల్ చేయాలని సూచించారు.