విద్యుత్ శాఖకు రూ.16వేల కోట్లు .. గృహజ్యోతి కోసం2,418 కోట్లు

విద్యుత్ శాఖకు రూ.16వేల కోట్లు ..  గృహజ్యోతి కోసం2,418 కోట్లు

విద్యుత్ శాఖకు బడ్జెట్​లో రూ.16,825 కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. గృహజ్యోతి స్కీమ్ కోసం రూ.2,418 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రస్తుత అంచనా ప్రకారం గృహజ్యోతి పథకానికి నెలకు రూ.360 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌‌ సరఫరా చేస్తామని ప్రకటించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కొరత లేకుండా చూసుకుంటామన్నారు. డిమాండ్​కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. సోలార్ పవర్ జనరేషన్​లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, స్పిన్నింగ్ మిల్లులకు సబ్సిడీల కోసం ఈ కేటాయింపులు చేసినట్టు స్పష్టమవుతున్నది. గతేడాది బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ శాఖకు రూ.12,727 కోట్లు కేటాయించింది.