ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్..నైజీరియాన్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు..

ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్..నైజీరియాన్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు..

ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్ లో దేశవ్యాప్తంగా వ్యాపించిన నైజీరియాన్ డ్రగ్స్ నెట్ వర్క్ ను డీకోడ్ చేసింది ఈగల్ టీం.ఈ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా 16 టీమ్స్‌తో అంతర్రాష్ట్ర దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం 50 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు భారీగా డ్రగ్స్, నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ డ్రగ్ లింక్స్ పై ఫోకస్ పెట్టింది ఈగల్ టీం 

ఈ జాయింట్ ఆపరేషన్ లో మొత్తం 50 మంది ఓవర్ స్టే నైజీరియన్స్ పట్టుబట్టలు తెలిపారు పోలీసులు. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖలో ఈ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు పోలీసులు. మొత్తం 20 ప్రాంతాల్లో 100మంది ఢిల్లీ సీసీఎస్ పోలీసులు,124మంది ఈగల్ టీమ్ అధికారులు ఏకకాలంలో సెర్చ్ నిర్వహించినట్లు సమాచారం. డ్రగ్ కింగ్‌పిన్, డ్రగ్ సేల్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్, పేర్లతో ఉన్న  మ్యూల్ అకౌంట్ హోల్డర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు.

డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న ఈగల్ టీమ్ చేపట్టిన భారీ ఆపరేషన్ విజయవంతమయ్యిందని తెలిపారు. నోయిడా,గ్వాలియర్, విశాఖలో స్థానిక పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు ఈగల్ టీం అధికారులు.