Aadhaar: బ్రేకింగ్ న్యూస్.. 2 కోట్ల ఆధార్‌ నంబర్లను తొలగించిన కేంద్రం !

Aadhaar: బ్రేకింగ్ న్యూస్.. 2 కోట్ల ఆధార్‌ నంబర్లను తొలగించిన కేంద్రం !

ఢిల్లీ: చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. 2 కోట్లకు పైగా ఆధార్‌ నంబర్లను UIDAI తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. తొలగించిన ఆధార్‌ నంబర్‌ మరొకరికి కేటాయించమని యూఐడీఏఐ స్పష్టం చేసింది. 

భారత రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన మరణాల నమోదు డేటా ఆధారంగా.. ఇతర డేటాతో ఆధార్ రికార్డులను సరిపోల్చిన తర్వాత UIDAI ఇంత పెద్ద ఎత్తున చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను డీయాక్టివేషన్‌ చేసింది.

ఈ డీయాక్టివేషన్ ప్రక్రియ 2024లోనే మొదలైంది. జులై 2025 నాటికి కోటీ 17 లక్షల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసింది. సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 1.4 కోట్లకు చేరింది. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన డేటా ప్రకారం.. 2025 నవంబర్ 26 నాటికి దేశంలో 2 కోట్ల ఆధార్ నంబర్లను UIDAI డీయాక్టివేట్ చేసింది. ఈ 2 కోట్ల మంది చనిపోయిన వాళ్లే. మరణాల నమోదు డేటా ఆధారంగా వీరి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ డీయాక్టివేషన్ ప్రక్రియ సాగింది.