
తెలంగాణలో కరోనా కారణంగా ఎంసెట్ ఎగ్జామ్స్ రాయలేని విద్యార్ధుల భవిష్యత్ పై గందర గోళం నెలకొంది. విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం అందించకుండానే రేపు అంటే అక్టోబర్ 3 మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎంసెంట్ ఎగ్జామ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చర్యలు చేపట్టారు.
అయితే ఈ ఏర్పాట్లపై తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం రాజకీయ నాయకుల పిల్లలు, ఉన్నతాధికారుల పిల్లల కోసమే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎంసెంట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.,
విద్యార్థులు సైతం ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా సుమారు 10వేల మందికి పైగా ఎంసెంట్ ఎగ్జామ్ రాయలేదని గణాంకాలు చెబుతున్నాయి. తొలిసారి ఎంసెంట్ సందర్భంగా కరోనా కారణంగా ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్ధులకు మరోసారి నిర్వహిస్తామని చెప్పిన అధికారులు..రేపు నిర్వహించే ఎగ్జామ్ గురించి ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఇదే విషయంపై అధికారుల్ని ప్రశ్నించగా తమదగ్గరున్న డేటా ఆధారంగా 80మంది విద్యార్థులకు ఎంసెంట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం కరోనా సోకడంతో 10వేలకుపైగా విద్యార్ధులు ఎగ్జామ్స్ రాయలేదు. అలాంటిది ఏ ప్రాతిపదికన అధికారులు కేవలం 80 విద్యార్ధులకు ఎంసెంట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది.