
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బుజ్జగించారు. టికెట్ రాని నేతలు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుసుకున్న బండి సంజయ్ ఆదివారం రాత్రి కొందరు నేతలను ప్రత్యక్షంగా, మరి కొందరికి ఫోన్లు చేశారు.
సంగారెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డ దేశ్ పాండే రాజేశ్వర్ రావును, పటాన్ చెరు టికెట్ దక్కని శ్రీకాంత్ ను, నర్సాపూర్ నుంచి పోటీ చేసే అవకాశం రాని గోపితో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా తగిన న్యాయం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అసంతృప్తులను సంజయ్ కోరారు.