
తెలంగాణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఎన్నికల కోసం 100 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. వీరంతా అక్టోబర్ 20 వ తేదీన నుండి విధుల్లో ఉంటారు.
ALSO READ: హైదరాబాద్కు కొత్త బాస్.. సీవీ ఆనంద్ స్థానంలో .. విక్రమ్‌సింగ్ మాన్
మరోవైపు రాష్ట్ర ఎన్నికల కోసం పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల బందోబస్తుకు 65 నుంచి 70 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యే పోలీసులే కాకుండా ఎన్నికల విధుల కోసం రాష్ట్రంలో 40 వేల మంది పోలీసులు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. వీరికి తోడు ఎక్సైజ్, అటవీ శాఖల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్‌పై ఎన్నికల బందోబస్తుకు వినియోగించనున్నారు. అలాగే సరిహద్దు రాష్ట్రాల నుంచి 20 వేల మంది పోలీసు సిబ్బందిని రప్పిస్తున్నారు. వీరితో పాటు.. కొత్తగా శిక్షణలో చేరిన ఎస్సై అభ్యర్థులు, త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న కానిస్టేబుల్ అభ్యర్థుల సేవలను వినియోగించుకునే అంశాన్నీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.