మేడ్చల్​లో కోదండరాం పోటీపై ఇంకా నిర్ణయం తీస్కోలే

మేడ్చల్​లో కోదండరాం పోటీపై ఇంకా నిర్ణయం తీస్కోలే

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్, ధర్మార్జున్ తెలిపారు. కోదండరాం పోటీపై రాష్ట్ర కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ విషయమై అస్సలు చర్చే జరగలేదని స్పష్టం చేశారు. టీజేఎస్​ను బద్నాం చేసేందుకు కొందరు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ను ఓడించేందుకు.. ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసేలా తమ పార్టీ కృషి చేస్తోందని  వెల్లడించారు.