
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేయడంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న డీఏలపై నిర్ణయం తీసుకోవడం మంచి విషయమన్నారు. మిగతా సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరించాలని కోరారు.
గత ప్రభుత్వంలో నాలుగు, ప్రస్తుత ప్రభుత్వంలో ఒకటి చొప్పున డీఏలు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు డీఏలను ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఉద్యోగులకు కొంతమేర ఉపశమనం కలిగిందన్నారు. మిగతా డీఎలను దశలవారీగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.