క్రీడలతో ఒత్తిడి దూరం : షానవాజ్‌‌‌‌ ఖాసీం

క్రీడలతో ఒత్తిడి దూరం : షానవాజ్‌‌‌‌ ఖాసీం

పద్మారావునగర్, వెలుగు: క్రీడలు ఒత్తిడిని దూరం చేస్తాయని ఎక్సైజ్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్ మెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ షానవాజ్‌‌‌‌ ఖాసీం అన్నారు. ఎక్సైజ్‌‌‌‌ శాఖ ఉద్యోగులు క్రీడలను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్​రైల్వే స్టోర్స్‌‌‌‌ క్లబ్‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌ స్టేడియంలో తెలంగాణ ఎక్సైజ్‌‌‌‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఉద్యోగులకు చెస్‌‌‌‌, బ్యాడ్మింటన్‌‌‌‌, టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌, క్యారమ్స్​ పోటీలు నిర్వహించారు.

 ఆదివారం ముగింపు వేడుకలకు డైరెక్టర్‌‌‌‌ హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అడిషనల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ సయ్యద్‌‌‌‌ యాసిన్‌‌‌‌ ఖురేషి, జాయింట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ సురేశ్​రాథోడ్‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌ అకాడమీ జాయింట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ శశిధర్‌‌‌‌రెడ్డి, ఎస్టీఎఫ్‌‌‌‌ అధికారులు  పాల్గొన్నారు.