ఇవాళ తెలంగాణ ఎక్స్ ప్రెస్ 3 గంటలు ఆలస్యం

ఇవాళ తెలంగాణ  ఎక్స్ ప్రెస్ 3 గంటలు ఆలస్యం

సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్, న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్​ప్రెస్ శుక్రవారం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజూ ఉదయం 6 గంటలకు నాంపల్లి నుంచి మొదలయ్యే ఈ ట్రైన్​శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందని స్పష్టం చేశారు.

సాంకేతిక సమస్యల కారణంగా ట్రైన్ ఆలస్యంగా స్టార్ట్​అవుతోందని, ప్రయాణికులు సహకరించాలని కోరారు. 9.25 గంటలకు సికింద్రాబాద్, 11.20కు కాజీపేట, 12.45కు రామగుండం, ఒంటి గంటకు మంచిర్యాల, 1.23కు బెల్లంపల్లి, 2.04 గంటలకు సిర్పూర్​కాగజ్​నగర్ చేరుకుంటుందని వెల్లడించారు.