ఫిఫా వరల్డ్ కప్ కోసం తెలంగాణలో  బార్ల టైమ్ పెంపు

ఫిఫా వరల్డ్ కప్ కోసం తెలంగాణలో  బార్ల టైమ్ పెంపు

ఫిఫా వరల్డ్ కప్ 2026 థర్డ్ ప్లేస్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌‌ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని బార్లకు పనివేళలు పెంచింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఈ నెల 18 నుంచి 19 మధ్య రాత్రి బార్లు ఉదయం 4:30 గంటల వరకు, 19- నుంచి 20 మధ్య రాత్రి నుంచి ఉదయం 3:00 గంటల వరకు తెరిచి ఉండొచ్చు.

ఈ పొడిగించిన సమయం కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న 2బి బార్లు, సి1 క్లబ్‌‌లు, టూరిజం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ ఇన్-హౌస్ బార్లు, మైక్రోబ్రూవరీస్‌‌కు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.