తెలంగాణ విముక్తి యోధురాలు చకిలం లలితమ్మ కన్నుమూత

తెలంగాణ విముక్తి యోధురాలు చకిలం లలితమ్మ కన్నుమూత

హైదరాబాద్‌: తెలంగాణ విముక్తి యోధురాలు చకిలం లలితమ్మ(93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..శనివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. లలితమ్మ స్వస్థలం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం నామారం. లలితమ్మ మృతితో ఆమె స్వస్థలంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు కుటుంబసభ్యులు.

తెలంగాణా సాయుధ పోరాటంలో పురుషులతో ధీటుగా మహిళలు పాల్గొన్నారు. అందులో చాకలి ఐలమ్మ, చెన్నబోయిన కమలమ్మ, దొడ్డి వజ్రమ్మ, చకిలం లలితమ్మ ఉన్నారు.