
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ గ్రాండ్ ప్రి–3 అథ్లెటిక్స్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి గందె నిత్య గోల్డ్ మెడల్‌తో మెరిసింది. బెంగళూరులో బుధవారం జరిగిన విమెన్స్ 200 మీటర్ల రన్‌లో నిత్య 24.23 సెకండ్ల టైమింగ్‌తో టాప్ ప్లేస్ సాధించింది. కావేరి (కర్నాటక) 24.38 సెకండ్లతో సిల్వర్, అభినయ (తమిళనాడు) 24.39 సెకండ్లతో బ్రాంజ్ గెలిచారు.