తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధికి బ్లూప్రింట్ అని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం చెప్పారు. ఫ్యూచర్ సిటీ ఇన్నోవేషన్ హబ్ గా మారుతుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పారిశ్రామిక వేతలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
భారత జీడీపీ కన్నా తెలంగాణ జీడీపీ ఎక్కువ అని..2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకుంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని.. హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ గా మారిందని అన్నారు. దేశంలోనే తొలిసారి ఏఐ విలేజ్ నిర్మిస్తున్నామని తెలిపారు.
►ALSO READ | Telangana Global Summit : యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేశారు: నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలన పూర్తి చేసుకుందని.. 2047 కి 3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి గ్లోబల్ సమ్మిట్ మైల్ స్టోన్ గా నిలుస్తుందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ అని అన్నారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ ముందుందని తెలిపారు. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 3.7 లక్షలు గా ఉందన్నారు. మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ లో తెలంగాణ ముందుందని.. టెక్నాలజీ, వెదర్, హ్యూమన్ పవర్ పరంగా తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి బెస్ట్ ప్లేస్ అని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ లో AI యూనివర్సిటీ రాబోతుందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. విజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పొలిటికల్ స్టెబిలిటీ తో రాష్ట్రం ముందుకు వెళ్తుందన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి తెలంగాణ వెల్కమ్ చెబుతుందని పిలుపునిచ్చారు.
