తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యిందని అన్నారు నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన సత్యా్ర్థి.. యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతాలు చేశారని కొనియాడారు. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారని,
మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణం కల్పించడం గొప్పవిషయమని చెప్పారు.
తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు కైలాష్ సత్యార్థి. విజన్ తెలంగాణ సక్సెస్ కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 2034 వరకు 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యమేనని అన్నారు.
సీఎం రేవంత్ నెహ్రూ, గాంధీజీల ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. వికసిత్ భారత దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని.. తెలంగాణ ప్రత్యేక విజన్ తో ముందుకెళ్తోందన్నారు. కళలు, టెక్నాలజీ, పరిశ్రమల హబ్ గా తెలంగాణ మారిందని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను గవర్నర్ ప్రారంభించారు. 2025 డిసెంబర్ 08 నుంచి రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ALSO READ : మోడ్రన్ స్టేట్ గా తెలంగాణ ..
2047 నాటికి రాష్ట్రాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చాలన్న విజన్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అత్యంత ఆధునిక హంగులతో కూడిన వేదికలు, డిజిటల్ టన్నెళ్లు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు అతిథులకు స్వాగతం పలుకుతున్నాయి.. రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించడమే ప్రధాన అజెండాగా ఈ సమిట్ నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
