మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • డిసిసి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, వెలుగు: తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్‌‌‌‌, ఆర్డీవో మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ స్వరూపా రాణి, తహసీల్దార్ నవీన్ కుమార్, మెప్మా టీఎంసీ అనిత పాల్గొన్నారు.

కాంగ్రెస్​ సర్కార్‌‌‌‌‌‌‌‌తోనే మహిళల అభివృద్ధి 

పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్​సర్కార్‌‌‌‌‌‌‌‌తోనే మహిళల అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి  మున్సిపల్​కార్యాలయంలో సోమవారం ఇందిరా మహిళ శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ  సందర్భంగా రూ. 1,03,67,848  కోట్ల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. 

మంథని, వెలుగు: మంథని మున్సిపల్ ఆఫీస్‌‌‌‌లో కమిషనర్ మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఆర్డీవో సురేశ్​ 54 స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.