ఆదిపురుష్ : 6 షోలు వేసుకోండి.. రూ.50 పెంచుకోండి

ఆదిపురుష్ :  6 షోలు వేసుకోండి.. రూ.50 పెంచుకోండి

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పి్ంది.  రోజుకు ఆరు షోలకు తెలంగాణ సర్కార్ గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది.  సింగిల్  స్క్రీన్ థియేటర్లకు స్పెషల్ ఆఫర్లు ఇచ్చింది.   రిలీజైన మొదటి మూడు రోజులకూ  సినిమా టికెట్ కు రూ. 50 పెంచుకునే వెసులుబాటును కలిపించింది.  తెలంగాణ సర్కార్ జీవో ప్రకారం ఉదయం 4 గంటలకే షో మొదలు కానుంది.  2023 జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్  భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.  

రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రాముడిగా, హీరోయిన్‌ కృతిసనన్‌.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, హనుమంతుడిగా సన్నీసింగ్‌ నటించారు. భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.   తాజాగా ఈ సినిమా సెన్సార్  పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు యు (U) సర్టిఫికెట్‌ జారీ చేసింది.  

సెన్సార్‌ బోర్డు  రివ్యూ ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలుగా  ఉంది.  అంటే 179 నిమిషాలు అన్నమాట.   ఈ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో ఓ సీటును హనుమంతుడికి కేటాయిస్తున్నట్టుగా ఇప్పటికే టీమ్‌ ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10 వేలకుపైగా టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టుగా నిర్మాత  అభిషేక్‌ అగర్వాల్‌ ఇప్పటికే తెలిపారు.