
తక్షణం సమ్మెను విరమిస్తున్నట్లు సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీనిపై మంత్రి హరీశ్ రావు నుంచి పూర్తి స్థాయి హామీ వచ్చిందని వెల్లడించింది. ఇక విధుల్లో కొనసాగుతామని స్పష్టం చేసింది. సీనియర్ రెసిడెంట్లకు వారంలోగా స్టైఫండ్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీంతోపాటు అటెండెన్స్ ఆధారంగా మే 2021 స్టైఫండ్ చెల్లించేందుకు కూడా సుముఖత తెలిపినట్లు పేర్కొంది. 12 నెలల కాల పరిమితి గల సర్టిఫికెట్ ఇచ్చేందుకు సమ్మతి తెలిపిన రాష్ట్ర సర్కారుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.